|
|
ఆకట్టుకున్న జానపద నృత్యోత్సవం – 2011 |
|
||||
నవరస్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మే 25 , బుధవారం రాత్రి త్యాగరాయ గాన సభలో జానపద నృత్యోత్సవం – 2011 రసవత్తరంగా సాగింది. ఆధునిక నృత్య రీతులకు ఏ మాత్రం తగ్గకుండా యువకళాకారులు ప్రదర్శించిన జానపదనృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
నవరస్ ఆర్ట్స్ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ డాన్సర్ పి. నగేష్ ఆధ్వర్యంలో పలువురు నృత్య కళాకారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శ్రీ పి. నగేష్ ఆధ్వర్యంలో హార్వెస్ట్, కోయం, దాండియా, రాజస్థానీ, పంజాబి, నృత్యాలు, జి.జాషువా ఆధ్వర్యంలో గోండు, డప్పు, పి. విజయ కుమార్ ఆధ్వర్యంలో బోనాలు ప్రదర్శన జరిగింది.
ఈ కార్యక్రమంలో జానపద కళాకారిణి షెర్లీ, ఆల్ రౌండర్మాగంటి ఉదయ్ భాస్కర్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ పి.వి.రంగారావు పాల్గొన్నారు.
శ్రీ పి.వి. రంగారావు మాట్లాడుతూ “ ఆధునిక నృత్య రీతులకు ఏ మాత్రం తగ్గకుండా జానపదాలు రూపొందాయని, ప్రభుత్వం సాంస్కృతిక, క్రీడారంగాలకు ప్రోత్సాహం అందించాలని,అలాగే నేటి యువత కూడా జానపద కళారీతుల పట్ల ఆశక్తి కల్గించాలని” ఆయన అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా వెంకట దీక్షితులు, మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్, కధక్ నృత్య కళాకారుడు పండిట్ అంజిబాబు, ఎస్.భాస్కర రావు, నిర్మాత హరిగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
|
||||
|
||||
|
||||
No videos
Lambadi Dance at Janapada Nruthyotsavam 2011
Folk Perfromance at Janapada Nruthyotsavam 2011
Koya Dance at Janapada Nrutyotsavam 2011
Allrounder Maganti Uday Bhaskar Felicitation
Folk Artist Sharli Felicitation
Foik Dance at Janapada Nrutyotsavam 2011






















