|
|
Shivaleela Burra Katha Ganam on 15th June 2012 at Ravindra Bharathi రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన ‘శివలీల బుర్ర కథ గానం’
|
|
||||
Shivaleela Burra Katha Ganam on 15th June 2012 at Ravindra Bharathi
రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన ‘శివలీల బుర్ర కథ గానం’
రాష్ట్ర సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో రవీంద్రభారతి ఘంటసాల కళావేదిక లో జరగుతున్న బుర్రకధ సప్తహానికి విశేష స్పందన కనిపిస్తుంది. రెండవ రోజు బుర్రకథ సప్తహంలో ఖమ్మం జిల్లా వెంకటాపురంకు చెందిన దయీక సరోజిని బృందం ‘శివలీల’ బుర్రకథా గానం చేసి భక్తీ సంద్రంలో ముంచెత్తారు. జన్మలన్నింటిలో మనవ జన్మ అత్యుత్తమమైనదని మోక్ష మార్గాన్ని చూపించి గొప్ప సందేశాన్ని చాటిచెప్పారు. పార్వతి భక్తుడికి పెట్టిన పరీక్షలో శివలీలలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చెప్పి కధకురాలు సరోజిని హర్షద్వానాలందుకున్నారు.
రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి.రమణ మూర్తి విచ్చేసి బుర్రకధ కళాకారులను సత్కరించారు. తెలంగాణా నాజర్ గా గుర్తింపు పొందిన సీనియర్ బుర్రకధకుడు బర్ల రత్నం(భువనగిరి) ను ప్రత్యేకంగా సన్మానించారు. ప్రాచీన జానపద కాళలకు పరిరక్షించుకునేందుకు చాయశక్తులా కృషి చేస్తామని ఆయన పునరుద్ఘటించారు. త్వరలో చిందు యక్షగాన సప్తాహం, పద్య కళాకారుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు రమణమూర్తి ప్రకటించారు.
బుర్రకథ సప్తహంలో భాగంగా శనివారం హైదరాబాద్ కు చెందిన మర్ల విజయుడు బృందం “అల్లూరి సీతారామరాజు” బుర్రకధా గానం చేస్తారని ప్రజా సంబంధాల అధికారి మహమ్మద్ రఫీ తెలిపారు. అరుదైన జానపద బుర్రకథ కళాకారులకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం లో భాగంగా ఈ సప్తాహం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు.

No videos
Shivaleela Burra Katha Ganam at Ravindra Bharathi 2
Shivaleela Burra Katha Ganam at Ravindra Bharathi